Monday, April 29, 2024
- Advertisement -

రామ‌ల‌క్ష్మి మంచుల‌క్ష్మిలాగే ఉందే..

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాపీలు కొట్ట‌డం కొత్త కాదు… మొన్న ఒక పెద్ద‌ సినిమా కూడా కాపీ సినిమా కావ‌డంతో వివాదాస్ప‌ద‌మైంది. చివ‌రికి స‌ర్దుబాటు చేసుకొని సినిమా విడుద‌ల కాగా అట్ట‌ర్‌ఫ్లాప‌య్యింది. ఆ త‌ర్వాత సైన్యం నేప‌థ్యంలో వ‌స్తున్న ఓ కుర్ర హీరో కూడా ఓ సినిమా కాపీ అని పుకార్లు వ‌స్తున్నారు. ఇప్పుడు మ‌రో సినిమా కాపీలాగా క‌నిపిస్తోంది. అదే రామ్‌చ‌ర‌ణ్ సినిమా ‘రంగ‌స్థ‌లం’.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ చిట్టిబాబు, స‌మంత రామ‌ల‌క్ష్మిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా స‌మంత పాత్ర టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో స‌మంత అచ్చం ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపిస్తోంది. బిందె ప‌ట్టుకొని నీళ్ల‌కు వెళ్తూ.. సైకిల్ తొక్కుతూ.. క‌ట్టెల మోపూ మోస్తూ వెళ్తుండ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది.

కానీ ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల రామ‌ల‌క్ష్మి మ‌న మంచుల‌క్ష్మిలాగా క‌నిపిస్త‌లేదు. అదేనండి గుండెల్లో గోదారి సినిమాలో మంచు ల‌క్ష్మి పాత్ర మాదిరి క‌నిపించ‌డం లేదూ. ఆ సినిమా గోదావ‌రి ఒడ్డున ముంపు ప్రాంతంలో తీసిన సినిమా. అప్ప‌ట్లో ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం పొందింది. ఇప్పుడు రామ‌ల‌క్ష్మి పాత్ర కూడా మంచుల‌క్ష్మిని గుర్తుచేస్తోంద‌.ఈ సినిమా ఇటీవ‌ల ఐట‌మ్ సాంగ్ పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీన విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌. అయితే ఈ సినిమాలో స‌మంత మూగ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -