Monday, May 6, 2024
- Advertisement -

‘గాయత్రి’ రివ్యూ

- Advertisement -
క‌లెక్ష‌న్ కింగ్‌, డైలాగ్‌లు చెప్ప‌డంలో ఆయ‌న‌కు తిరుగులేని న‌టుడు. ఎన్నో విభిన్న సినిమాల్లో ప్రేక్ష‌కాభిమానాన్ని పొందిన సీనియ‌ర్ న‌టుడు డాక్ట‌ర్ మంచు మోహ‌న్‌బాబు. ఇటీవ‌ల తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్న త‌ర‌చూ తన కుమారుల సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో ‘గాయత్రి’ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఆయ‌న ప‌లికే డైలాగ్‌లు, హావ‌భావాలు అద్భుతంగా ప‌లికిస్తోంది. ఆయ‌న త‌న త‌నయుడు విష్ణుతో క‌లిసి ఓ సినిమాలో వ‌స్తోంది.
 
కథ: దాసరి శివాజీ (మోహన్‌బాబు) శారదాసదన్‌ అనే అనాథాశ్రమం నిర్వ‌హిస్తుంటాడు. ఆయ‌న ఒక స్టేజ్‌ ఆర్టిస్ట్ కూడా. దీంతోపాటు డబ్బుకోసం మారువేషం వేసుకుని కోర్టుల్లో శిక్షపడిన వారి స్థానాల్లోకి వెళ్తుంటాడు. ఈ విధంగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే అతడి కూతురు గాయత్రి (నిఖిలా విమల్‌) చిన్నప్పుడే క‌నిపించ‌కుండాపోతుంది. గాయ‌త్రి కోసం పాతికేళ్లుగా శివాజీ వెతుకుంటాడు. ఈ స‌మ‌యంలో శివాజీపై జ‌ర్న‌లిస్ట్ శ్రేష్ట (అన‌సూయ) అత‌డి నేర ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని చూస్తుంది. ఇదే స‌మ‌యంలో కూతురు కనిపిస్తుంది. తండ్రి, కూతురు క‌లుస్తున్న స‌మ‌యంలో గాయత్రి పటేల్ (మోహన్‌బాబు) శివాజీని కిడ్నాప్‌ చేస్తాడు. గాయత్రి పటేల్‌.. శివాజీని ఎందుకు కిడ్నాప్‌ చేయాల్సి వచ్చింది? శివాజీ గతం ఏంటి? చివ‌రికి తండ్రీ కూతుళ్లు  కలిశారా? అనేవి సినిమా చూడాల్సిందే!
 
తండ్రీకూతుళ్ల అనుబంధంపై సినిమా ఉంది. తప్పిపోయిన కూతురిని వెతుకుతూ తండ్రి సాగించిన ప్రయాణంగా సినిమాను రూపొందించారు. ఈ స్టోరీకి కొన్ని అంశాలు జోడించి కమర్షియల్ సినిమాగా తీశారు. ప్ర‌థ‌మార్థంలో కథ పెద్దగా ఉండదు. పాత్రల పరిచయంతో కొన‌సాగుతుంది. సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభ‌మై శివాజీ (విష్ణు), భార్య శారద (శ్రియ) మధ్య పరిచయం, వారి ప్రేమ, పెళ్లి వ‌స్తాయి. విష్ణు మోహ‌న్‌బాబు క‌నిపిస్తుంది. సినిమాలో గాయత్రి పటేల్‌ రాకతో రసవత్తరంగా మారుతుంది. చివరాంకంలో సినిమా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. కథలో మలుపులు, ఉత్కంఠ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ సీట్లో కూర్చొపెడుతుంది. మోహన్‌బాబు పొలిటికల్‌ డైలాగులు, రామ‌య‌ణం, మ‌హాభార‌తంపై డైలాగ్‌లు ఆక‌ట్టుకున్నాయి. 
 
న‌టీన‌టుల తీరు: చాన్నాళ్ల మోహన్‌బాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించారు. పైగా ద్విపాత్రాభినయం చేశారు. శివాజీగా, గాయత్రి పటేల్‌గా రెండు భిన్న భావాల‌ను ప‌లికించారు. గాయత్రి పటేల్‌లో ఆయ‌న న‌టన, డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. విష్ణు కన్పించింది కాసేపే. అయినా అతడి నటన ఆకట్టుకుంటుంది. శ్రియ అలా వ‌చ్చి వెళ్లిపోతుంది. ఉన్నంతసేపూ ఆక‌ట్టుకుంది. ఇంకా నిఖిలా విమల్‌, శ్రేష్ఠగా అనసూయ ప‌రిధి మేర‌కు న‌టించారు. తమన్ మ్యూజిక్ సినిమాలో లీన‌మ‌య్యేట‌ట్టు చేస్తోంది. డైలాగ్‌లు, కెమెరా పనితనం సినిమాను నిల‌బెట్టింది. 
చివ‌రి మాట‌: సినిమా మోహ‌న్‌బాబు రీ ఎంట్రీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయ‌న న‌ట‌న‌, ద‌ర్శ‌కుడి ప‌నితనం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఉంది. థియేట‌ర్ల‌లో చాన్నాళ్లు నిల‌బ‌డే సినిమా.
 
న‌టీనటులు: మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ తదితరులు
దర్శకత్వం: ఆర్.ఆర్‌ మదన్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌
నిర్మాత: మోహన్‌బాబు
బ్యాన‌ర్: ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌
 
 
 
 
 
 
 
 
 
 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -