Sunday, May 5, 2024
- Advertisement -

సిరీస్ విజ‌యానికి ఒక్క అడుగు దూరంలో కోహ్లీసేన‌….

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవ‌డానికి టీమిండియా ఒక్క అడుగుదూరంలో నిలిచింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినా వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి ఆధిప‌త్యం మ‌న‌దే. దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై మూడు విజయాలు సాధించిన ఘనతను సొంతం చేసుకున్న భారత్‌.. సిరీస్‌ విజయంతో నయా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

సఫారీ గడ్డపై భారత జట్టు ఇప్పటివరకూ వన్డే సిరీస్‌ను గెలిచిన దాఖలాలు లేవు. దాంతో భారత్‌ ముందు వన్డే సిరీస్‌ను గెలిచేందుకు ఒక సువర్ణావకాశం. శనివారం ఇక్కడ సాయంత్రం గం. 4.30 ని.లకు ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే ఆరంభం కానుంది.ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తుండగా, రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని సఫారీలు యోచిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో నాల్గో వన్డేలో భారత జట్టు గెలిస్తే నంబర్‌ వన్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకుటుంది. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డే తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత జట్టు.. మూడో వన్డేలో గెలిచి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే ఈ సిరీస్‌ను భారత జట్టు 4-2తో గెలిచిన పక్షంలోనే అగ్రస్థానం నిలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన పక్షంలో మిగతా రెండు మ్యాచ్‌లతో సంబంధం లేకుండా సిరీస్‌ను నంబర్‌ వన్‌ ర్యాంకుతో ముగిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -