Sunday, May 19, 2024
- Advertisement -

భార్య దెబ్బ‌కు ప్ర‌మాదంలో ష‌మి కెరీర్… ! ఐపీఎల్ నుంచి ఔట్‌..?

- Advertisement -

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఇత‌ర మ‌హిల‌తో వివాహేత‌ర సంబంధాలున్నాయ‌ని భార్య హ‌సిన్ జ‌హాన్ గొద్దిరోజుల క్రితం సంచ‌ల‌నాత్మ‌క ఆరోప‌న‌లు చేసిన సంగ‌తితెలిసిందే. ఏకంగా కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఫాస్ట్ బౌలర్‌పై హత్యాయత్నం, గృహ హింస కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే మహ్మద్ షమీకి కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మహ్మద్ షమీ తనని శారీరకంగా హింసిస్తున్నాడని, అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా హసీన్ బహిర్గతం చేయడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఫాస్ట్ బౌలర్‌కి వార్షిక కాంట్రాక్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా కేసుల నేపథ్యంలో ఐపీఎల్‌లో షమీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంఛైజీ కూడా అతడ్ని పక్కన పెట్టాలని యోచిస్తోంది.

బెంగళూరు వేదికగా ఈ ఏడాది జనవరి 27, 28న జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో మహ్మద్ షమీని రూ. 3 కోట్లకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుండగా.. ఒకవేళ సీజన్ మధ్యలో షమీ అరెస్టు అయితే.. టోర్నీకి చెడ్డపేరు వస్తుందని ఢిల్లీ ఫ్రాంఛైజీ, బీసీసీఐ భావిస్తోంది. దీంతో మ‌హ‌మ్మ‌ద్‌ష‌మీ కెరీర్ మ‌రింత సంక్లిష్టంగా మారిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -