Sunday, April 28, 2024
- Advertisement -

విశ్వంభర..చిరుకు విలన్ ఎవరో తెలుసా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేయగా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఫాంటసీ మూవీ ఇదే. చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. మెయిన్ విలన్ గా వెర్సటైల్ నటుడు రావు రమేష్ కనిపించనున్నారని సమాచారం. తొలిసారిగా చిరుకు విలన్‌గా నటించనున్నారు రావు రమేష్‌. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -