Friday, April 19, 2024
- Advertisement -

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

- Advertisement -

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇప్పుడు అంద‌రి ప్ర‌శ్న‌. అయితే.. శంక‌ర్ డైరెక్ష‌న్ లో సినిమా అంటే ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. అటువంటి క్రేజీ డైరెక్ట‌ర్ తో సినిమా చేసే అవ‌కాశం రామ్ చ‌ర‌ణ్ కు రావ‌డంతో ఎంతో ఆనంద‌ప‌డిపోతున్నాడ‌ట‌.

జెంటిల్‌మెన్‌, భారతీయుడు, అపరిచితుడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ల‌ను ఇచ్చిన క్రేజీ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటు చ‌ర‌ణ్ అంటున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఆయ‌న పాత సినిమాల‌లాగే ఇండ‌స్ట్రీ హిట్ కొడుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తియ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కుతుంద‌ట‌. ఇందులో హీరోయిన‌గా రష్మిక మందన నటించనుందని స‌మాచారం. ఇది క‌నుక నిజం అయితే ర‌ష్మిక న‌క్క‌తోక తొక్కిన‌ట్టే.. అని ప‌లువురు అంటున్నారు. అయితే హీరోయిన్ గా ర‌శ్మిక‌ను తీసుకోవాలని చరణ్.. శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే.. ఇది ఎంత నిజ‌మో తెలుస్తుంది.

అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -