Sunday, April 28, 2024
- Advertisement -

గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?

- Advertisement -

మ‌నం తినే టిఫిన్ దోశ గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే దోశ మ‌రింత ప్ర‌త్యేకం. ఎందుకంటే అది ప్లైయింగ్ దోశ (గాల్లో ఎగిరే దోస‌). మీరు చ‌దివింది నిజ‌మే. అది గాల్లో ఎగిరే దోశ‌. దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే కేవ‌లం వారం రోజుల్లోనే 8 కోట్ల మందికిపైగా చూశారు ఈ దోశ‌ను. అస‌లు ఎగిరే దోశ ఎంటి? దాన్ని ఎనిమిది కోట్లకు పైగా జ‌నాలు చూడ‌టం ఏంటి? అనే క‌దా మీ ప్ర‌శ్న.

అయితే, ఈ స్టోరీ తెలుసుకోల్సిందే.. ! ప్ర‌స్తుతం సా‌మాజిక మాధ్య‌మైన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో దోశ గాల్లో ఎగ‌ర‌డం క‌నిపిస్తుంది. ఆ వీడియోను కేవ‌లం ఒక్క వారంలోనే 8.44 కోట్ల మంది చూశారు. సోష‌ల్ మీడియ‌లో ఇప్పుడు ఈ ఫ్లైయింగ్ దోశ ముచ్చ‌ట మార్మోగి పోతుంది.

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యిలో మంగ‌ళ్‌దాస్ మార్కెట్ లో ఉండే ఓ వ్య‌క్తి దోశలు ఎంతో రుచిగా వేయ‌డం ఆయ‌న‌కే చెల్లుతుంది. దాన్ని అంతే ప్రత్యేక‌త‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు మాములుగా ఫ్లేట్‌ల‌లో పెట్టి ఇవ్వ‌కుండా.. గాల్లో విసురుతూ అందిస్తాడు. దీనికి సంబంధించి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఆయ‌న ప్ర‌తిభ‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు ఆల‌స్యం మీరు కూడా చూసేయండి మ‌రి ఆ వీడియోను..!

https://fb.watch/3T6RXlXkHN/

కోయ‌కుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !

జ‌క్క‌న్నా.. మ‌జాకా.. విడుద‌ల‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !

మీరు కారణ జన్ములు.. తెలంగాణకు పండుగ రోజు : హరీష్ రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -