Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్‌తో రష్మికా..ఫైనల్!

- Advertisement -

సలార్ హిట్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్‌తో పాటు సలార్ 2,సందీప్ వంగా దర్శకత్వంలో సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

ప్రధానంగా సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే అర్జున్ రెడ్డి,యానిమల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్. తాజాగా ప్రభాస్‌తో స్పిరిట్‌తో రానుండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

యానిమల్ బ్యూటి రష్మికాను ప్రభాస్‌కు జోడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట సందీప్. ఈ సినిమాకు సంబంధించిన రష్మికాను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -