Saturday, April 27, 2024
- Advertisement -

నా సామిరంగ..నాగ్‌తో రష్మికా!

- Advertisement -

విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నా సామిరంగ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. సినిమాకు మరింత హైప్ హైప్ తీసుకొచ్చేలా ఓ ఇంట్రెస్టింగ్ ఫీమేల్ రోల్ క్రియేట్ చేశారట. ఇందులో రష్మికా హీరోయిన్‌గా నటించనున్నారట. ఇప్పుడు ఈ వార్త నాగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపగా రష్మికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జునతో ‘దేవదాస్’ సినిమాలో నటించింది రష్మికా. అయితే ఆ సినిమాలో నానికి జోడిగా నటించగా ఇప్పుడు మాత్రం నాగ్‌తో పక్కాగా రొమాన్స్ చేయనుందట రష్మికా. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఓ వైపు పుష్ప సీక్వెల్ చేస్తూనే మరోవైపు నాగ్ సినిమాలో నటించనుందట రష్మికా.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించారు. 2024 సంక్రాంతికి థియేట్రిక‌ల్ రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి అంటే నాగ్‌కు మోస్ట్ ఫేవరేట్. గతంలో సంక్రాంతికి వచ్చిన నాగ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నా సామిరంగపై భారీ హైప్ క్రియేట్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -