Tuesday, May 21, 2024
- Advertisement -

లోకేష్‌కు ఇప్పుడు అర్ధమైంది…న్యాయం గెలవడం పక్కా!

- Advertisement -

చంద్రబాబు గతమెంతో ఘనం..ఆయన చెప్పిందే వేదం. ఎన్ని ఆరోపణలు వచ్చినా అవన్నీ ఆయన రాజకీయ చతురత ముందు ఉత్తిదే. సింగపూర్‌,దుబాయ్‌లో బ్లాక్‌ మనీ ఆరోపణలు,బాబు అంటే ఓ అవినీతి అనకొండ..కానీ వాటిని నిరూపించడం ఇన్నాళ్లు ఎవరికి సాధ్యం కాలేదు. చివరికి వైఎస్ సైతం బాబు అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు మేనెజ్‌మెంట్ ముందు పనిచేయలేదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. బండ్లు ఓడలు…ఓడలు బండ్లు అవుతుంటాయి…ఇప్పుడు అదే జరిగింది.

2014 నుండి 2019 వరకు బాబు చేసిన అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో ప్రజలే నివ్వేరపోతున్నారు. ఆనాడు చంద్రబాబు ఏం చేసినా చిటికెలో సాయం చేసిన వారంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.ఇలాంటి పరిస్థితిని నారా ఫ్యామిలీ కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే చంద్రబాబు సచ్చీలుడని నిరూపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ముందు దోషిగానే నిలబడే పరిస్థితి నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ లోకేష్ రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ఆయనకే కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు.

చట్టం ముందు అంతా సమానమేనని..న్యాయం గెలవడం పక్కా అని చంద్రబాబు నిజాయితీ పరుడని చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్.కానీ దానినే రివర్స్‌ చేస్తూ లోకేష్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇన్నాళ్లకు లోకేష్‌కు జ్ఞానోదయం అయిందని…ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తండ్రి అవినీతి పరోక్షంగా లోకేష్ ఒప్పుకున్నాడని కౌంటరిస్తున్నారు.

13 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్..ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిసే అవకాశం దక్కగా అదేదో విజయం సాధించినట్లుగా లోకేష్‌ వ్యవహరిస్తున్నారని నవ్వుకుంటున్నారు. లోకేష్‌ రాష్ట్రపతిని కలిసినా, కేంద్ర బీజేపీ పెద్దలను కలిసినా ఉపయోగం లేదని…బాబు అవినీతి సాక్ష్యాలతో సహా నిరూపితమైందని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇక ఈ సందర్భంగా లోకేష్ చేసిన ప్రతీ వ్యాఖ్యకు ప్రజలే సమాధానం ఇస్తున్న పరిస్థితి.

ఐటీ ఉద్యోగుల ఆందోళన వెనుక టీడీపీ ఐటీ సెల్ ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో అర్ధమైపోయింది. తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఇది పక్కా రాష్ట్రం ఇష్యూ దానికి తెలంగాణకు ఏం సంబంధమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి ఇవ్వకపోవడంతో లోకేష్ స్వయంగా తనకు ఫోన్ చేశారని వెల్లడించారు కేటీఆర్. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో అనుమతిఇచ్చేది లేదని చెప్పాని కేటీఆర్ వెల్లడించడంతో టీడీపీ కుట్ర మరోసారి భట్టబయలైంది. ప్రజల సానుభూతి పొందేందుకు చివరి అస్త్రంగా ఐటీ ఉద్యోగులను వాడుకున్నారని కానీ అది బుమారాంగ్ అయిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే త్వరలోనే చినబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -