రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఇటీవల ఎంగేజ్‌మెంట్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై వీరిద్దరూ మాత్రం స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లిపై రూమర్స్ వైరల్‌గా మారాయి.
తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ధృవీకరణ రాకపోయినా, రష్మికను ఇటీవలఓ ఇంటర్వ్యూలో నేరుగా పెళ్లి విషయంపై అడగడంతో ఈ రూమర్లు వైరల్‌గా మారాయి.
పెళ్లి గురించి ఇప్పుడే నిర్ధారించను, ఖండించను కూడా. మాట్లాడాల్సిన సమయంలో మేమే చెబుతాం అని ఆమె సమాధానంగా చెప్పింది రష్మిక. సమంత రూత్ ప్రభు–రాజ్ నీడిమోరు వివాహం తర్వాత, సహజంగానే రష్మిక–విజయ్ అంతా దృష్టి సారించారు. రష్మిక ప్రస్తుతం కాక్టెయిల్ 2 చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో ఆమెకీతో పాటు కృతి సనన్, షాహిద్ కపూర్ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ అయితే కీర్తి సురేశ్‌తో కలిసి రౌడీ జనార్ధన్ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు.
