- Advertisement -

ఆ ముగ్గురిని జైలుకు పంపాలి..!

- Advertisement -

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ ను జైలుకు పంపాలని జగన్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చూసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సినంత దుస్థితి వచ్చింది అంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన సెటైర్లు విసిరారు. రైతులు, విద్యా రంగం, సంక్షేమం తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను ఈ స్థాయిలో మోసం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై చీటింగ్ కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

రైతులను రోజూ మోసం చేస్తూ ‘రైతన్నా మీకోసం’ అని చంద్రబాబు చెప్పుకోవడం విచిత్రం. నిజంగా రైతుల దగ్గరకు వెళ్లే పరిస్థితి వారికి లేదు. వారికి ప్రశ్నలు వేసే ధైర్యం రైతులకు ఉంది, కానీ సమాధానాలు చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు అని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నీ అబద్ధాలేనని, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ అన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోయాయని అన్నారు.

తల్లికి వందనం అని గొప్పగా చెప్పుకున్నా – మొదటి సంవత్సరం పూర్తిగా వాయిదా వేశారు. రెండో సంవత్సరం 20 లక్షల మందికి ఇవ్వలేదు. 15 వేల చెబితే 13 వేలే ఇచ్చారు. మూడు ఉచిత సిలిండర్లు అంటారు, కానీ రెండేళ్లలో రెండు మాత్రమే ఇచ్చి.. అదీ అందరికీ కాదు. ఉచిత బస్సు కూడా కొందరికే పరిమితం చేశారు. ఇవన్నీ మోసమే కాదా? అని జగన్ ప్రశ్నించారు.

విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 7 వేల కోట్ల రూపాయలకు పైగా అలాగే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు చదువు మానుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిస్థితి దయనీయంగా ఉంది. కలుషిత ఆహారం వల్ల 29 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం చరిత్రలో లేని విషాదం అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -