Saturday, May 18, 2024
- Advertisement -

రవితేజను అరెస్ట్ చేస్తారా..? ఎందుకు.. ఎప్పుడు..?

- Advertisement -

టాలీవుడ్ లోని ప్రముఖులకు సిట్ అధికారులు.. డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హీరో రవితేజ కి కూడా నోటిసులు ఇచ్చారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజర్ అవుతున్నారు. రేపు రవితేజ సిట్ ముందుకు వెళ్లబోతున్నాడు. సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు ముమైత్ ఖాణ్ విచారణకు హాజర్ అయ్యారు.

అయితే రవితేజను కాస్త సీరియస్ గా విచారించే అవకాశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. . అందులో ఒక వ్యక్తి రవితేజకు మేనేజర్ అని సమాచారం. ఆయన నుండి సేకరించిన వివరాల ప్రకారం రవితేజ డ్రగ్స్తీసుకోవడంతో పాటు పలువురికి స్వయంగా డ్రగ్స్ ను ఇచ్చాడు అని వెళ్లడైంది. మేనేజర్ సాయంతో రవితేజ డ్రగ్స్ వ్యాపారం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రవితేజ చిక్కులో ఇరుక్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు విచారణకు హాజరు అయ్యే రవితేజను అక్కడే అరెస్ట్ చేస్తారనే ఊహాగాణాలు జోరుగా వినిపిస్తున్నాయి.

మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఇతరత్ర ఆధారాలను చూపించి రవితేజను అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అందుకే రేపు సిట్ ముందుకు వెళ్లేందుకు రవితేజ తీవ్ర మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక రెండు రోజులుగా షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -