Friday, May 3, 2024
- Advertisement -

రవితేజ నిలదొక్కుకోవటం కష్టమే!

- Advertisement -

రవితేజ గూరించి ఎవరిని అడిగిన ఎనర్జిటిక్ మ్యాన్ అంటారు. అతని సినిమాలు ఎప్పుడు గోల గోల చేస్తున్న అల్లరి గా ఉంటాయి. ఈ హీరో అందరి హీరోల కాకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ పోయాడు. అంత వేగంగా సినిమాలు చేసే రవితేజా ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. శరవేగంగా సినిమాలు చేయడం వల్ల ఒక దశలో వరసగా సినిమాలు దెబ్బ తిన్నాయి.

దీంతో రేసు లో నుంచి బాగా వెనకబడిపోయాడు ఈ మాస్ మాహా రాజా. చాలా డల్ అయిపోయింది అనుకున్న సమయంలో “బలుపు” చిత్రం రవికి మంచి బూస్ట్ నిచ్చించింది. ఇక అక్కడ నుంచి మళ్లీ దూకుడు పెంచ్చాడు. అయితే ప్రస్తుతం కుర్ర హీరోలు బాగా సినిమాలు చేస్తుంటే రవి మాత్రం వారికి పోటీనిచ్చే సినిమాలు చేయడం లేదు. పోయిన ఏడది ఎన్నో ఆశలు పెట్టుకున్న “బెంగాల్ టైగర్” యావరేజ్ గా నిలిచింది. ఇక అప్పటినుంచీ ఇప్పటివరకు రవితేజ సినిమాలు ఏదీ మొదలు అవ్వలేదు. నిజానికి రవి దిల్ రాజ్ తో ఈ సినిమా చేయాల్సింది.

అయితే రెమ్యునరేషన్ తక్కువ కావడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో ఓ సినిమాను త్వరగానే మొదలుపెడదామని చూశాడు కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పటిదాకా అది పట్టాలెక్కలేదు. ఎప్పుడు లేని గ్యాప్ ఇచ్చాడు రవితేజ్. ఈ గ్యాపులో ఒక సినిమా పూర్తి చేయవచ్చు.  ఇక ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకోక… అనుకున్న సినిమా మొదలు కాక వచ్చే రెమ్యునరెషన్ ని కూడా లాస్ అయ్యాడు రవితేజా. సో ఇప్పటికైన త్వరగా సినిమా మొదలు పెట్టి రేసులోకి దిగాల్సిందే లేకపోతే ఇప్పుడున్న పోటీలో నిలదొక్కుకోవటం కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -