Tuesday, May 21, 2024
- Advertisement -

సంపూకి ఘోర అవమానం..!

- Advertisement -

అందరిని నవ్విస్తే ఆ ఆర్టిస్టును అందరూ ఇష్టపడతారు. ఇంకొందరు తమ ఇష్టంతో కొన్ని ఈవెంట్స్ కు వారిని పిలిచి వారిచేత తమ వారిని అనందపరుస్తుంటారు ఆర్గనైజర్స్. కాకపోతే అన్ని ఆర్గనైజేషన్స్ ఒకలా ఉండవు. కాబట్టి ఆర్టిస్టులు కూడా మంచి  ఈవెంట్స్ కు వెళుతుంటారు. అయితే ఇటివలె జరిగిన ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఉత్సవాలకు హీరో సంపూర్ణేష్ బాబు ఇన్వైట్ చేశారట.

అయితే ఈ ఇన్వైట్ ఏం జరిగిందో తెలియాదు కాని సంపూ అండ్ కో ను సదరు ఆర్గనైజర్ శ్రీరాజ్ చెన్నుపాటి అనే వ్యక్తి బండబూతులు తిట్టాడట. ఈ విషయాన్ని సంపూ తన ఫేస్ బుక్ ద్వారా ఆవేదన తెలిపాడు. అంతే కాకుండా ఇలాంటి బూతులు చాలా రోజుల తర్వాత విన్నానని చెప్పాడు. 

అయితే అతను తననే కాకుండా ఆ ఆటా ఉత్సవాలకు రావాలి అనుకున్న వారినిపై కూడా అలాగే బిహేవ్  చేస్తున్నాడట. అందుకే తన టీమ్ ఈ ఆటా ఉత్సవాలకు రావడం లేదు అని చెబుతూ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా ఇలాంటి ఉత్సవాలకు పిలిచినప్పుడు తమ పట్ల మంచితనంతో ఆర్టిస్టులుగా చూడాలి కానీ వ్యభిచారులుగా  కాదు అంటూ చాలా కోపంగా స్పందించాడు. అయితే సదరు ఆర్గనైజర్ ఎందుకు తమను తిట్టాడో చెబితే బాగుండు అని సంపూను ప్రశ్నిస్తున్నారు కొందరు. అయితే గతంలో కూడా సంపూ పై అమెరికాలో జరిగిన ఉత్సవాలకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వినిపించాయి. మరి ఇందులో ఎవరి తప్పు ఎంతుందో సంపూకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -