Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి లో శివిగామి అసలు విలనిజం!

- Advertisement -

బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరి తట్టే మొదటి ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ఓ పెద్ద టాపిక్ అయ్యింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి. ఈ ప్రశ్న కు జవాబు మాత్రం బాహుబలి -2 లో తెలుస్తోంది అని జక్కన్న చెప్పాడు. అయితే ఈ ప్రశ్న గురించి మీడియా కూడా ఈ సినిమా యూనిట్ అడుగుతూనే ఉంది.

బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, రానా.. ఇలా ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నను ఎదుర్కొంటూనే ఉన్నారు. అదే ప్రశ్నని కట్టప్పని అడిగితే? నాకు ఏం తెలియాదు రాజమౌళి చంపమన్నాడు నేను చంపానని సరదగా చెప్పుతున్నాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అవి ఏంటంటే నిజానికి బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాహుబలి కథకు విలన్ బల్లాలదేవుడో,బిజ్జలదేవుడో అనుకుంటారు. కానీ ఇది అసలు విషయం కాదట. తన కొడుకే రాజు కావాలన్న ఉద్దేశంతో శివగామే ఇలా చేస్తుందట. అంటే సినిమాలో అసలు విలన్ శివగామే అట. అయితే బాహుబలి -2 లో అసలు విలనిజం బయట పడనుందట. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అంటే కట్టప్ప శివిగామి కుటుంబానికి బానిస. కాబట్టి తన కొడుకే రాజు కావాలని శివగామి కట్టప్ప చేత బాహుబలిని చంపిస్తుందట. ఇక్కడ మరో ట్విస్ట్ ఉందట అవంతిక ఎవరో కాదట కట్టప్ప కూతురట.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -