- Advertisement -

భార్య, అత్త మీద కోపంతో పైరసీ వైపు!

- Advertisement -

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBOMMA) వ్యవస్థాపకుడు రవి వ్యక్తిగత జీవితం, ఆయన పైరసీ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి. 2016లో ఉన్నత కుటుంబానికి చెందిన ఓ యువతిని ప్రేమించి రవి పెళ్లి చేసుకున్నారు.

వెబ్ డిజైనర్ అయిన రవి అప్పట్లో సంపాదించే అరకొర ఆదాయాన్ని చూసి, డబ్బు సంపాదించడం చేతకాదంటూ ఆయన భార్య, ఆమె తల్లి అవహేళన చేశారట. ఈ అవమానం రవిని తీవ్రంగా కలచివేసింది. భార్య, అత్తలపై కోపంతో, వారికి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో రవి పైరసీ వైపు మళ్లారు.

ఈ క్రమంలోనే ఆయన ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్‌లను రూపొందించారు. వీటి ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ రవి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించారు. ఎంత సంపాదించి చూపించినా, ఆయనతో కలిసి ఉండటానికి భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో వీరికి విడాకులు అయ్యాయి. అనంతరం రవి తన మకాంను నెదర్లాండ్స్ దేశానికి మార్చారు. అక్కడి నుంచే పైరసీ సినిమాలను విడుదల చేస్తూ ఆయన తన సంపాదనను గణనీయంగా పెంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -