Sunday, May 19, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లా టీడీపీలో మొద‌ల‌యిన సీట్ల కుమ్ము లాట‌…..

- Advertisement -

సంక్రాంతికి ముందే క‌ర్రూలుజిల్లా టీడీపీ కోళ్లు పందానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో నాయుల్లో సీట్ల భ‌యం మొద‌ల‌య్యింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీటు నాదంటే నాద‌ని ఆధిప‌త్య‌పోరు మొద‌ల‌య్యింది. తామే గెలుపు కోళ్లమని కూడా ప్రకటించుకుంటున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీలో సీట్ల లొల్లి షురూ అయ్యింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే క‌ర్రూలు ప‌ట్ట‌నం టికెట్ స‌ర్వేఆధారంగా త‌న‌కే సీటు వ‌స్తుంద‌ని టీజీ భ‌ర‌త్ ప్ర‌క‌టిస్తుండ‌గా….సిట్టింగ్‌ ఎమ్మెల్యే హోదాలో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌ల‌య్యింది. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో నేనే పోటీ చేస్తాన‌ని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అద‌లా ఉంటే ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోకూడా నేత‌ల మ‌ధ్య లొల్లి షురూ మొద‌ల‌య్యింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌నం త‌ర్వాత అఖిల ప్రియ మంత్రి అయ్యారు. అప్ప‌టినుంచి మంత్రి….ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.

తాజాగా నూతన సంవత్సర వేడుకల సాక్షిగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీట్ల గొడవ ప్రారంభమైంది. తనకే అధిక బలం ఉందని నిరూపణ కోసం ఏవీ ప్రయత్నించారు. భూమా బంధువులు కూడా తన వెంటే నడుస్తారని చెప్పుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకునే పనిలో మంత్రి అఖిలప్రియ నిమగ్నమయ్యారు. ఏవీ పార్టీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే పని చేశారు. మంత్రిగా, తన తండ్రి వారసురాలిగా తనకే సీటు అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే అంద‌రికీ స‌ర్వే గుబులు మొద‌ల‌య్యింది. మొదట్లో కేవలం కర్నూలు నియోజకవర్గంలోనే అభ్యర్థిపై సర్వే జరగగా… తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్లు వస్తుండటం గమనార్హం. పోటీలో ఎవరు నిలబడితే గెలుస్తారో చెప్పాలంటూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఆయా నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. దీంతో సీటు ద‌క్కుతుందో లేదోన‌ని ఆందోల‌న‌లో ఉన్నారు నాయ‌కులు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటిప‌రిస్థితులు ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -