Monday, May 20, 2024
- Advertisement -

బెయిల్ రాదు..ఆశలు వదులుకున్న టీడీపీ!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, అమరావతి రాజధాని నిర్మాణం;పైబర్ నెట్ వర్క్ స్కాం ఇలా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు చంద్రబాబు పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే ఈ కేసుల్లో చంద్రబాబు పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది ఏపీ సీఐడీ. న్యాయస్థానానికి ఇందుకు సంబంధించిన ఛార్జీషీట్‌లను సైతం సమర్పించింది. దీంతో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేయగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా 40 రోజుల నుండి ఉన్నారు.

ఇక బాబు అరెస్ట్ తర్వాత టీడీపీ, చంద్రబాబు తరపు న్యాయవాదులు చేయని ప్రయత్నం లేదు. ఓ వైపు న్యాయస్థానంలో చంద్రబాబు లాయర్లు మరోవైపు ప్రజాక్షేత్రంలో టీడీపీ ఆందోళనలు అయినా ఇవేమి ప్రభావం చూపించలేకపోయాయి. చివరకు బాబు వయస్సు, ఆరోగ్యం,భద్రతా అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక బాబు అనుకూల మీడియాలో ఇదిగి బెయిల్ అదిగో బెయిల్‌ అంటూ ప్రచారం చేస్తున్నా అవి ఉట్టిమాటలే అని తేలిపోయాయి.

దీంతో ఇప్పటివరకు చంద్రబాబు బయటకు వస్తారని ఆశించిన టీడీపీ నేతలు, నారా కుటుంబ సభ్యులకు అలాంటి అవకాశం లేదని అర్ధం కావడంతో బాబు బెయిల్‌పై ఆశలు వదులుకున్నారు. దీంతో ప్లాన్ బీలో భాగంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర మరోవైపు భువనేశ్వరి బస్సుయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బుధవారం ఢిల్లీ నుండి వచ్చిన లోకేష్‌..చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారట. సో మొత్తంగా ఏపీపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు నారా ఫ్యామిలీ. మరి బాబు లేని లోటును ఏ విధంగా అధిగమిస్తారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -