- Advertisement -

ప్రపంచకప్…టాప్ ప్లేస్‌లో న్యూజిలాండ్

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతోంది న్యూజిలాండ్. వరుసగా నాలుగో విజయం సాధించి మెరుగైన రన్‌రేట్‌తో నెంబర్‌ 1 స్ధానంలో ఉంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆప్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యంతో గెలుపొందింది కివీస్. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘానిస్తాన్‌ 34.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్‌ అయింది. రహ్మత్‌ షా (36) పర్వాలేదనిపించగా రహ్మానుల్లా (11), ఇబ్రహీం (14), హష్మతుల్లా (8), అజ్మతుల్లా (27), ఇక్రామ్‌ (19), మహమ్మద్‌ నబీ (7), రషీద్‌ ఖాన్‌ (8) విఫలమయ్యారు.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (71), టామ్‌ లాథమ్‌ (68), విల్‌ యాంగ్‌ (54) రాణించగా ఓ దశలో 110 పరుగలకే 4 వికెట్లు కొల్పోగా ఈ దశలో కివీస్‌ను కెప్టెన్‌ లాథమ్‌, ఫిలిప్స్‌ ఆదుకున్నారు. ఫిలిప్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్‌.. ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌కి తోడు బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -