Saturday, May 25, 2024
- Advertisement -

రోదసిలోకి పునర్వినియోగ రాకెట్

- Advertisement -

ప్రపంచంలో భారత శక్తి అంతకంతకు పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ మేం ముందున్నాం అని చెప్పేందుకు మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఫలించి భారత కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయి. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది.

ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో అంతరిక్షంలోకి దూసుకువెళ్లి.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన అంతరిక్ష నౌకను తిరిగి అక్కడే పంపే ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. సోమవారం నాడు ఈ ప్రయోగానికి ఇస్రో వేదిక కానుంది. షార్ వేదికపై 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువుతో ఉన్న ఈ రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది.  

సోమవారం ఉదయం ఈ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపారు. నిజానికి దీనికి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రయోగించాలని భావించారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో ఉదయం 7 గంటలకే దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లిన ఆర్ ఎల్వీ టిడి బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్ వే పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ఇస్రో కీర్తి, భారత ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -