- Advertisement -

పెద్ది..రన్‌టైంపై రూమర్స్!

- Advertisement -

సినిమా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేసేసింది.

తాజాగా సెకండ్ సింగిల్ Rai Rai Raa Raa ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా ఇక ఈ సినిమా రన్ టైం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట సినిమా రన్‌టైం దాదాపు నాలుగు గంటలుగా ఉండగా దాన్ని మూడు గంటల వరకు కుదిస్తున్నారు అనే ప్రచారం జరిగింది. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో చిత్ర బృందం అధికారికంగా స్పందించింది.

ఈ రూమర్లను నమ్మవద్దని మేకర్స్ అభిమానులను కోరారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ మాత్రమే లాక్ చేసినట్లు తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. సెకండ్ హాఫ్ షూటింగ్ తుది దశలో ఉండగా, ఎడిటింగ్ పనులు సమాంతరంగా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 30 విడుదలకు అన్నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని భరోసా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -