- Advertisement -

సరస్వతి..ఆ ట్విస్టే కీలకం!

- Advertisement -

వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరస్వతి. ఈ నెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు వరలక్ష్మీ.

తాను సాధారణంగా ఏ సినిమా చూసినా అందులోని ట్విస్ట్‌ను ముందుగానే ఊహించగలుగుతానని వరలక్ష్మి తెలిపారు. అందుకే ‘సరస్వతి’ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ప్రధాన ట్విస్ట్ ప్రేక్షకులు అసలు ఊహించలేనంతగా ఉండాలని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు.

సినిమా స్క్రీన్‌ప్లేను అత్యంత జాగ్రత్తగా రూపొందించి, చివరి వరకు ఉత్కంఠను నిలబెట్టేలా పని చేశామని ఆమె వెల్లడించారు. ప్రేక్షకులు చివరి సన్నివేశం వరకు ఆసక్తిగా కూర్చునేలా కథనాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తుండగా దర్శకురాలిగా వరలక్ష్మీ సక్సెస్ కొడతారా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -