- Advertisement -

గెట్ రెడీ ఫర్..వృషకర్మ గ్లింప్స్!

- Advertisement -

అక్కినేని నాగైతన్య – కార్తీక్ దండు కాంబినేషన్‌లో వస్తున్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక వృషకర్మకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ అప్‌డేట్ వచ్చేసింది.

మార్చి 5, 2026న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ఈ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం (లైవ్) కానుంది.

దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -