Wednesday, May 15, 2024
- Advertisement -

నానికి సాయి పల్లవి షాక్ ఇచ్చేలా ఉందిగా..?

- Advertisement -

నాని ఏ రోల్ చేసిన ఆ రోల్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అంత సహజంగా ఆ పాత్రలో నాని ఒదిగిపోతాడు. అందుకే అభిమానులంతా.. ఆయనను నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన ఓ సీన్ చేస్తున్నాడంటే.. ఆ పాత్రలో ఒదిగిపోతాడు. అయితే ఆ సీన్ లో నాని ఉన్నప్పుడు ఆయనతో సమానంగా నటించాలనే ఆలోచనలో మిగతా ఆర్టిస్టులంతా ఉండిపోతారు. ఇక నాని అంతటి సహజంగా నటించడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని కొంతమంది కథానాయికలు వ్యక్తం చేస్తూ వచ్చారు.

నటనలో ఆయనతో కాస్త పోటీ పడిన కథానాయికగా ఇంతవరకూ నివేదా థామస్ పేరే వినిపించింది. త్వరలో ఆమె స్థానంలో సాయి పల్లవి పేరు వినిపించే ఛాన్సు ఉందని అంటున్నారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో నాని జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ‘ఫిదా’ లో ఆమె నటన చూసిన వాళ్లంతా, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో నటన పరంగా ఈ అమ్మాయి నానికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సాయి పల్లవిని నటన పరంగా నాని ఎలా ఎదురుకుంటాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=0I7gWnCAEDo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -