కరోనా లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు వరుసపెట్టి పెళ్లి పీటలెక్కేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఉన్న నిఖిల్, నితిన్, రానా పెళ్లి బంధంతో ఓ ఇంటివాళ్లుగా మారారు. ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు సీక్రెట్‌గా పెళ్లి పనులు చేస్తున్నారని టాక్.
ఆ మధ్య ప్రభాస్‌కు సారీ చెబుతూ తాను బ్యాచ్‌లర్స్ గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు సాయి తేజ్. అప్పుడే సాయితేజ్ పెళ్లి జరగబోతుందని వదంతువు వచ్చాయి. అయితే‘సోలో బ్రతుకే సో బెటర్’సినిమా ప్రచారంలో భాగంగా సాయితేజ్ అలా ట్వీట్ చేశాడని తేలడంతో మెగా ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. అప్పుడది చిత్ర ప్రచారం కోసమే అయినా ఇప్పుడు అది నిజం కాబోతుందట. సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు అనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఏడాది మే నెలలో సాయి తేజ్ పెళ్లి జరగబోతుంది. సాయి తేజ్ తల్లి, మెగా స్టార్ చిరంజీవి చెల్లెలు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసేశారట. ఆ అమ్మాయిని చూసిన సాయి ధరమ్ తేజ్ వెంటనే ఓకే చెప్పేయడంతో ఈ సంబంధం గురించి చిరంజీవికి వివరించారట. ఆయన కూడా మేనల్లుడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సంబంధాన్ని ఓకే చేసి తానే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటా అని మాటిచ్చారట. ఈ ఏడాది మేలో సాయి తేజ్ పెళ్లి ఉండబోతుదంట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.
Also Read
బిగ్‌బాస్ 5లోకి టిక్‌టాక్ దుర్గారావు!
చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే !
ప్రలోభాలకు దూరంగా ఉండండి.. వలంటీర్లకు జగన్ లేఖ