Saturday, April 27, 2024
- Advertisement -

నక్క తోక తొక్కిన టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు!

- Advertisement -

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ బిగ్ రియాల్టీ షోలో పాల్గొనడానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐదో సీజన్‌ నిర్వహించడానికి బిగ్‌బాస్‌ నిర్వాహకులు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు టీమ్ సెలబ్రిటీల వేటలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, యాంకర్ రవి, హైపర్ ఆదిలను బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదించినట్లు సమాచారం. ఈ జాబితాలో తాజాగా టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు కూడా చేరిపోయాడు.

దుర్గారావు.. సోషల్‌ మీడియాలో ఈ పేరు ఒక సంచలనం. టిక్ టాక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఓ పల్లెటూరి వ్యక్తి. తన భార్యతో కలిసి వేసిన స్టెప్పుల్లో సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. రఘు కుంచె సంగీత సారధ్యంలో వచ్చిన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యాడు. దుర్గారావు స్టెప్పులను సినీ హీరోలు కూడా వేశారంటే.. మనోడికి ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతుంది.

టిక్‌టాక్‌ బ్యాన్‌ అయినప్పటికీ.. దుర్గారావు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. యూట్యూబ్ ఆయన ఇంటర్వ్యూలకు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ఈ మధ్య సినిమాల్లోనూ ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. రవితేజ‘క్రాక్’సినిమాలో ఒక పాటలో స్టెప్పులేశారు. తాజాగా జగపతిబాబు కీలకపాత్రలలో నటించిన ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జగపతిబాబుతో కలిసి దుర్గారావు వేదికపై డ్యాన్స్ చేశారు. ఇంతటి క్రేజీ ఉన్న దుర్గారావును బిగ్‌బాస్‌లోకి తీసుకొస్తే తమ షోకు లాభం చేకూరుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే దుర్గా రావును బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజమైతే దుర్గారావు నక్కతోక తొక్కినట్లే.

Also Read

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా నాగ‌చైత‌న్య‌!

వ‌ద్దన్న అన్న‌‌.. వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం తీసుకున్న చెల్లెలు

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలుసా?

ఆ కారు అంటే ‘బుట్ట బొమ్మ’కు ప్రాణం అట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -