Wednesday, May 1, 2024
- Advertisement -

చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే !

- Advertisement -

అనారోగ్యానికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలంటే నిత్యం స్నానం చేయాల‌ని అంద‌రూ స‌ల‌హాలు ఇస్తుంటారు. ఈ క్ర‌మంలో రోజుకు ఒక్క‌సారి కాకుండా రెండు సార్లు స్నానం చేసేవారు అధికంగానే ఉంటారు. అయితే, చ‌లికాలంలో రోజూ స్నానం చేయ‌డం మంచిదేనా? అంటే కాదని అంటున్నాయి పలు పరిశోధనలు. చ‌లికాలంలో నిత్యం స్నానం చేసారంటే మీరు కోరి అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్న‌ట్టేన‌ని తాజాగా ఓ అధ్య‌య‌నం హెచ్చరించింది.

అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చ‌లికాలంలో స్నానం చేయ‌డం అనే అంశంపై అధ్య‌య‌నం చేశారు. దీనికి సంబంధించి వారు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ ప‌రిశోధ‌న బృందంలోని డాక్ట‌ర్ రానెల్లా మాట్లాడుతూ.. నిత్యం స్నానం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. మ‌న చ‌ర్మానికి స్వయంగా శుభ్రం చేసుకునే సామ‌ర్థ్యం ఉంద‌ని తెలిపారు.

ముఖ్యంగా చ‌లికాలంలో నిత్యం స్నానం చేయ‌డం ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని హెచ్చిరించారు. సాధార‌ణంగా చ‌లికాలంలో రోజు వేడి నీటితో స్నానం చేయ‌డం చ‌ర్మం పొడిబారిపోతుంది. దీని కార‌ణంగా చ‌ర్మంపై ఉండే మంచి బ్యాక్టిరియా కూడా చ‌నిపోతుంది. వివిధ ర‌కాల ఇన్ఫెక్ష‌న్ల నుంచి ఇది ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటుంది. దీని కార‌ణంగా చిన్ని స‌మ‌స్య‌లు తీవ్ర‌మైన అనారోగ్యానికి దారితీస్తాయి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను చూసుకుని రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి చ‌లికాలంలో స్నానం చేస్తే స‌రిపోతుంద‌ని బోస్ట‌న్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న బృందం పేర్కొంది.

చైనాలో పిల్ల‌లు పుట్ట‌ట్లే.. ! ఆందోళనలో ఆ దేశం.. అందుకేనా?

ర‌ష్మికకు ఇలాంటి వీడియోలు చేయ‌డం మొద‌టిసార‌ట‌‌!

పట్టులాంటి జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి.!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -