Sunday, May 19, 2024
- Advertisement -

సాక్షిలోనే దొంగలు ఉన్నారు?

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియాలో సాక్షి టీవీ చేసిన ఓ తప్పుడు క్రికెట్ అప్ డేట్ ప్రసారానికి  సంబంధించిన వీడియో… తెగ హల్ చల్ చేస్తుంది. దీని గురించి కొందరు అరిచిగోల చేస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటనేది ..

ఆ టైమ్లో అలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు వచ్చిందనేది చాలామందికి తెలియదు.వివరాల్లోకి  వెల్తే ఇటివలే భారత్, పాకిస్తాన్ ల మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్లో భారత్ పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‍కి సంబంధించిన న్యూస్ అన్నీ పేపర్లో…. ప్రేంట్ పేజీలో వేశారు. కానీ సాక్షిలో మాత్రం ఎదో చివరను చిన్న న్యూస్ లాగా వేశారు. అందరు గౌరవించగల ఈ న్యూస్‌ను ఇలా వేయడంపై కొందరు అలకబూనారు.

 ఇదే కాక మొన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‍  క్లైమాక్స్ అయితే… చాలా రసవత్తరంగా  నడిచింది. భారత్ చివరి వరకు పోరాడి గెలిచింది. ఇంత అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న విషయం తెలుసుకోకుండా…. భారత్ బోల్తా పడింది…. భారత్‍పై బంగ్లాదేశ్ రెండు వికేట్ల తెడాతో గెలిచిందని సాక్షి తప్పుడు వార్తను ప్రసారం చేసింది.

అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే..సాక్షి తప్పుడు ప్రసారం చేసింది ఓకే.అయితే దానికి సంబందించిన క్లీన్ ఫీడ్ ఎలా బయటకు వచ్చిందనే దానిపై ఆరా తీస్తే సాక్షిలో ఉన్న ఇంటి దొంగల విషయం బయటకు వస్తోంది.

ఇంతకీ సాక్షి ఎడిట్ చేయని ఈ వీడియోని ఎవరు బయటకు రిలీజ్ చేశారు..? పనిగట్టుకుని మరి ఎవరు దీన్ని వైరల్ గా స్ప్రెడ్ చేశారు.దీని బట్టి చూస్తే సాక్షి లో కొందరు ఉద్యోగులు గత కొంతకాలంగా పనిగట్టుకుని మరీ చేస్తోన్న కన్నింగ్ పాలిటిక్స్ విషయం మళ్లీ మీడియాలో చర్చనీయాంశ మయ్యాయి. సాక్షి ఉప్పు తింటునే  వెనకాల  గొతులు తీయడమంటే ఇదేనేమో.మిగతా యాజమాన్యలతో పోల్చుకుంటే ఉద్యోగులను సంస్థ ఎంత భాగా చూసుకున్నప్పటికీ అనుకోకుండా ఓ డెస్క్ ఉద్యోగి అత్యుత్సాహంతో చేసిన ఓ బ్లండర్ మిస్టేక్ వలన… సాక్షికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జగన్ ఎంతగానో ఏదో పొడిచేస్తారని  నమ్మిన భంటులు కూడా  ఇలా శ్రద్ధ లేకుండా సాక్షిని ఎలా నడుపుతున్నారని నెటిజన్లు  కూడా తెగ వర్రీ అయిపోతున్నారు. ఇలా చేయడం వల్ల మా అభిమాన రాజకీయ నాయకుడి పరువు తీసినట్లే అని వారు వాపోతున్నారు. ఇక ముందు కూడా ఇలానే చేస్తే సాక్షి పరువు పోతూనే………..నే ఉంటుంది. మరి ఇక నుంచైన ఇలాంటి తప్పులు జరగకుండా జగన్ అండ్ కో ఉన్న టీంకు ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -