Wednesday, May 1, 2024
- Advertisement -

సలార్ సేమ్ కేజీఎఫ్ ఫార్ములానే!

- Advertisement -

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇక ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మిక్స్‌ డ్ రెస్పాన్స్ వచ్చినా ప్రభాస్ స్టార్ డమ్‌తో రికార్డు వ్యూస్‌ని రాబట్టింది.

ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫుల్ మాస్‌గా ఈ సినిమా తెరకెక్కగా ట్రైలర్ మేకింగ్ అంతా కేజీఎఫ్ స్టైల్ లోనే కనిపించింది. ఇక కేజీఎఫ్ ఫార్ములాలో భాగంగా ఈ సినిమాలను పాటలకు తక్కువ స్కోపే ఉండనుందట.త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సలార్‌లో కేవలం రెండు పాటలే ఉంటాయని తెలుస్తోంది. ఒకటి ప్రభాస్ ఇంట్రో సాంగ్ ,మరొకటి ఐటమ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా పృథ్వీరాజ్ – ప్రభాస్‌ మధ్య ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా సలార్‌కు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -