Saturday, April 27, 2024
- Advertisement -

రోహిత్ ఓకే.. ఎటు వచ్చి విరాట్‌కే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలో సీనియర్లు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే టీ 20 ఫార్మాట్‌కు విరాట్ గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు కోహ్లీ. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడతాడా ? లేదా అనే సందేహాలు నెలకొనగా రోహిత్‌కు మాత్రం చాన్స్ దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే విరాట్ మాత్రం టీ20 వరల్డ్ కప్‌కు దూరం అవడం ఖాయం. ఎందుకంటే యంగ్ ఆటగాళ్ల నుండి విరాట్‌కు గట్టి సవాల్ ఎదురవుతోంది. కోహ్లీని తీసుకునేందుకు ఎవరిని తప్పించలేని పరిస్థితి. అయితే కోహ్లీ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఐపీఎల్‌. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరగనున్న ఐపీఎల్‌లో విరాట్ సత్తా చాటితే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -