Wednesday, May 15, 2024
- Advertisement -

ఐఏఎస్‌, ఐపిఎస్‌లకు అడ్డా ఈ పల్లెటూరు..!

- Advertisement -

ఐఏఎస్‌, ఐపిఎస్‌కు సెలెక్ట్‌ కావడమంటే డిగ్రీ అయిపోయినప్ఫటి నుండి చాలా మంది చాలా సంవత్సరాలు కష్టపడి సాధిస్తూ ఉంటారు. కానీ ఒక గ్రామంలో ఇంటికి ఒకరు ఐఏఎస్‍ లేదా ఐపిఎస్‌లు ఉన్నారు.

మీరు చదివింది నిజమేనండీ… ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్ జిల్లాలోని మేధోపట్టి గ్రామంలో ఇంటికో ఐఏఎస్ లేదా ఐపిఎస్‌లు ఉన్నారు. మామూలుగా అయితే ఒక గ్రామంలోఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగి ఉన్నాడు అంటేనే అందరూ ఆ ఊరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు.

అలాంటిది ఒకే గ్రామంలో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున ఐఏఎస్‌ లేదా ఐపిఎస్‌కు సెలెక్ట్ అయ్యారంటే, ఇది భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ పల్లెటూరు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అసలు నిజంగా ఇలాంటి గ్రామం ఒకటి ఉందా..! అన్నది కూడా ఇంతవరకూ ఎవరికి తెలీదు.. ఒక పల్లెటూరు నుంచి మొత్తం 75 కుటుంబాల్లో ప్రతి ఇంటి నుంచి ఒక ఐపిఎస్‌ లేదా ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు.

ఇలా ఇంతమంది సెలెక్ట్ అవ్వడానికి, ఆ మారుమూల గ్రామానికి ఇంతటి అరుదైన రికార్డు రావడానికి మొదటి పునాది రాయిగా ముస్తఫా హుస్సేన్ అనేవ్యక్తి 1914లో సివిల్‌ సర్వీస్‌లో చేరడం. ఆ తరువాత అదే గ్రామనికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి సివిల్‌ సర్వీస్‌లో రెండో ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు సెలెక్ట్ అవ్వడమే. అక్కడి నుంచి మొదలు అయింది ర్యాంకుల పంట. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకే ఇంటి నుంచి నలుగురు అన్నదమ్ములు సెలెక్ట్ కావడం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -