Monday, April 29, 2024
- Advertisement -

స‌మంత ఇక నుంచి ఆలాంటి సినిమాలు చేయ‌దంట‌..?

- Advertisement -

తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ కథానాయికగా సమంత దూసుకుపోతోంది. పెళ్లి అయిన త‌ర్వాత సినిమాల విష‌యంలో ఏమాత్రం దూకుడు త‌గ్గించ‌డంలేదు. అమె న‌టించిన సినిమాలు ఈ సంవ‌త్స‌రంలో భారీ విజ‌యాలు సాధించాయి. తెలుగులో రంగ‌స్థ‌లం ఎలాంటి సంచ‌ల‌న విజయాలు సాధించిందో అంద‌రికీ దెల‌సిందే.

ఆ క్రేజ్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. అందేకే యూట‌ర్న్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో న‌టించింది. అయితే థియోట‌ర్ల‌కు వ‌చ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో న‌ష్టాల‌ను చ‌విచూసింది. దీంతో ఇక నాయ‌క ప్ర‌ధాన్య‌త క‌లిగిన సినిమాల‌ను స‌మంత చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలతో మంచి లాభాలను తెచ్చిపెట్టిన కథానాయికగా అనుష్క కనిపిస్తుంది. ఇక తమిళంలో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను భారీ వసూళ్ల దిశగా పరిగెత్తించే నాయికగా నయనతార కనిపిస్తుంది. వారి బాట‌లో న‌డ‌వాల‌ని చూసిన స‌మంత‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. అందువలన ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆమె ఆసక్తి చూపకపోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -