Saturday, April 27, 2024
- Advertisement -

సమంత ఈ సినిమా లో విలన్ గా కనిపించనుందా..?

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయట్లేదని చెప్పాలి.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా చేసినా ఆ హిట్ రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో సమంత ది ఆ సినిమా లో ప్రేక్షక పాత్ర అయిపోయిందని చెప్పాలి.. యాక్టింగ్ విషయంలో ఇద్దరు సమఉజ్జీలుగా నటించిన రామ్ చరణ్ కి వచ్చినంత పేరు సమంత కు రాలేదు. డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది.. కానీ సమంత కు ఎక్కడ మిస్ అయ్యిందో తెలీదు కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు..

ఇక ఆ సినిమా తర్వాత సమంత కమర్షియల్ సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి.. ఆమెకు పెళ్ళయిపోవడం, ఇతర కుర్ర హీరోలు లైన్ లోకి రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా పెద్ద హీరోల సినిమాలు దూరమైపోయాయి.. అయితే ఆమెకు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.. సినిమాలు అటు ఇటు అయినా ఆమెకున్న మార్కెట్ తో పెట్టిన ఖర్చు అయితే వచ్చాయి.. దాంతో మినిమం హీరో రేంజ్ లో ఆమె ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వచ్చింది.. ఇక తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి..

మనోజ్ బాజ్పాయ్ నటించిన ఫామిలీ మెన్ సినిమా కి ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ అని తెలుస్తుంది.. అమెజాన్ లో గత ఏడాది వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే సీక్వెల్ చేశారు. ఈ సీక్వెల్ లో ప్రముఖ నటీనటులు నటించారు. సమంత కూడా ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ లో కనిపించబోతుంది. మొదటి నుండి కూడా ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఓ పాకిస్థాన్ టెర్రరిస్ట్ గా ఆమె ఈ సినిమా లో నటిస్తుందని తెలుస్తుంది.. ఈ పాత్ర చేయడంపై అక్కినేని ఫాన్స్ ఆమెపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆడియన్స్ లో ఇంత మంచి పేరు పెట్టుకుని విలన్ పాత్ర చేయడం పట్ల ఆమె ఉద్దేశ్యం ఏంటని వారు ఆవేశపడుతున్నారు.. మరి దీనికి సమంత ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి.

డ్రగ్స్ కేసులో మరో సంచలన పేరు.. హతవిధీ.. ?

చూడ‌రానిచోటు టాటూ వేయించుకున్న స‌మంత‌..? ఎవ‌రిదో తెలుసా..?

భర్త చనిపోయాడని.. మగాడితో కనిపిస్తే లింక్ పెట్టారు : సురేఖ వాణి

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -