Sunday, April 28, 2024
- Advertisement -

సొంత పార్టీ లోనే చంద్రబాబు కు వ్యతిరేక కూటమి తయరైందా..?

- Advertisement -

చంద్రబాబు రాజకీయ జీవితానికి స్వస్తి పలికే సమయం దగ్గరికొచ్చిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. అందుకు కారణం తాను ఎంతో నమ్మి పెంచి పోషించిన నాయకులూ తనకే వ్యతిరేకంగా పనిచేయడం.. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలను గుడ్డిగా నమ్మి వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోలేదు.. దాంతో ప్రజలు పలుమార్లు హెచ్చరించినా చంద్రబాబు చూసి చూడనట్లు ఉండడంతో ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారన్నది అందరికి తెలిసిన విషయం.. అయితే ఇప్పుడు చంద్రబాబు దీనిపై సరైన అవగాహనా పెంచుకుని ముందుకు వెళ్తుంటే నేతలు మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదట..

చంద్రబాబు హయాంలో అవినీతి కి పాల్పడ్డ వారు చంద్రబాబు వద్దన్నా వినే స్టేజి లో లేరని తెలుస్తుంది.. అంతేకాదు చంద్రబాబు దీనిపై వారిని పలుమార్లు హెచ్చరిస్తే చంద్రబాబు అడ్డు తొలగించుకునేలా ప్లాన్స్ చేస్తున్నారట.. దాంతో చంద్రబాబు తన కంట్లో తన వేలుతోనే పొడుచుకున్నట్లు అవుతుంది.. ఇదిలా ఉంటే ఇప్పటికే కష్టాల్లో ఉన్న పార్టీ ని మరిన్ని కష్టాల్లోకి నెడుతూ కొంతమంది టీడీపీ నేతలు చంద్రబాబు అనే కనీస మర్యాద లేకుండా వైసీపీ లోకి చేరిపోతున్నారు.. అలా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి చంద్రబాబు ను లెక్క చెయ్యట్లేదు. అయితే వీరు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక మైన నిర్ణయం తీసుకోవడం అంతటా ఆసక్తి ని కనపరుస్తుందట..

టీడీపీకి రాజీనామా చేసిన ఎంఎల్ఏలందరు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా తయారవుతున్నారు. . మొదటగా పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ తనను అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. తనకు టీడీపీకి సంబంధం లేదని కాబట్టి అసెంబ్లీ తాను టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే అవకాశం లేదన్నారు. కాబట్టి తనను స్వతంత్రసభ్యునిగా పరిగణించి ప్రత్యేకంగా సీటు చూపించాలని అడిగినపుడు స్పీకర్ సానుకూలంగా స్పిందించారు. మిగితా ముగ్గురు కూడా అలానే రిక్వెస్ట్ చేశారట.. మరి సీట్ల వరకైతే పర్వాలేదు.. విమర్శలు చేస్తే చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -