Saturday, May 4, 2024
- Advertisement -

సాయి పల్లవి గురించి సమంత అప్పట్లోనే ఏం చెప్పందంటే..?

- Advertisement -

ఫిదా మూవీ లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి పై ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మలయాళ మూవీ ప్రేమమ్ లో నటించిన సాయి పల్లవి ఒక్కసారి హైలైట్ అయింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఏ రెంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ మూవీ తర్వాత సాయి పల్లవికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తెలుగు లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఫిదా లో నటించే ఛాన్సు దక్కించుకుంది.

ఫిదా మూవీలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి భానుమతి పాత్రలో జీవించింది అని చెప్పాలి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవికి ఫిదా అయిపోయారు. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరస అవకాశాలు వచ్చి చేతిలో పడుతున్నాయి. అయితే సమంత మాత్రం చాలా సంవత్సారాల క్రితమే సాయి పల్లవిని పొగడ్తలతో ముచ్చెత్తింది. ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం అయిన ఢీ డ్యాన్స్ షోలో సాయి పల్లవి చాలా ఏళ్ల క్రితం పార్టిసిపెంట్ చేసింది. ఆ షోకు ఒక రోజు గెస్ట్ గా వెళ్లిన సమంత సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా అయ్యింది. అప్పుడే ఆమెపై ప్రశంసలు కురిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ వీడియోను బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సాయి పల్లవి మంచి నటి అని ఈ సందర్బంగా సమంత మరోసారి కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఇక సాయి పల్లవి పుట్టింది.. కేరళ దగ్గర వుండే కోటగిరిలో.. పెరిగింది మాత్రం కోయంబత్తూరులో. జార్జియా లోని బిసిలి స్టేట్ మెడికల్ యూనివర్సటీ లో మెడిసిన్ చదివింది. తర్వాత 2008 లో డీ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇక సాయి పల్లవికి ఓ చెల్లి ఉంది. ఆమె తండ్రి పోలీస్ ఆఫిసర్ అని తెలుస్తోంది. ఏది ఏమైన సాయి పల్లవి ఫిదా తో వచ్చి ప్రతి ఒక్కర్ని ఫిదా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -