Monday, May 6, 2024
- Advertisement -

‘గౌతమ్‌నంద’ మూవీ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ లో హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో గోపిచంద్. ‘జిల్’ తర్వాత గోపిచంద్ నటించిన తాజా చిత్రం ‘గౌతమ్‌నంద’. సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని జె.భగవాన్, జె.పుల్లరావ్ నిర్మించారు. క్యాథెరిన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించారు. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూదాం..

కథ :

దేశంలోనే బాగా డబ్బున్న వ్యక్తి ఘట్టమనేని గౌతమ్(గోపిచంద్). ఈ కుర్రాడు.. తన లైఫ్ ని తనకి నచ్చినట్లు ఎంజాయ్ చేస్తుంటాడు. గౌతమ్‌ కి గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది.. ఆమె ముగ్ధ(క్యాథెరిన్ థ్రెసా). బాగా డబ్బున్నదనే పొగొరుతో వుంటాడు. సన్నాఫ్ కేరాఫ్‌గా మారిపోయిన గౌతమ్‌కు తనని తాను నిరూపించుకోవాలని అనుకొని కొత్త ప్రయాణం మొదలుపెడతాడు. అందులో భాగంగానే గౌతమ్ జీవితంలోకి స్పూర్థి(హన్సిక) ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో గౌతమ్ అనుకొని సంఘటనలు ఎదురుకుంటాడు. ఇంతకీ గౌతమ్ ఎందుకు తనని తాను తెలుసుకోవాలనుకున్నాడు..? తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి ? చివరికి ఏం జరిగిందనేది మిగిత కథ..

ఎలా చేశారు..ఎలా ఉంది.. :

ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్ హీరో గోపిచంద్ నటన. లుక్స్ పరంగా.. పాత్ర పరంగా రెండు వేరియేషన్స్‌ లో బాగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో గోపిచంద్ దుమ్మురేపాడు. ఘట్టమనేని గౌతమ్ క్యారెక్టర్ నుంచి గౌతమ్‌నందగా మారే తీరు బాగుంది. ఇక గోపిచంద్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో క్యాథెరిన్ థ్రెసా బాగా చేసింది. మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్లో గ్లామర్ డోస్‌తో ఆకట్టుకుంది. ఇక స్పూర్థి పాత్రలో నటించిన హన్సిక తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక తనికెళ్ల భరణి, ముకేష్ రుషి, నికితిన్ ధీర్‌లు బాగా చేసారు. బిత్తిరి సత్తి తన మాటలతో నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిత నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మూవీ విషయంకు వస్తే.. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా హై లెవెల్లో కొనసాగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్‌లో లవ్, ఎమోషనల్ అంశాలతో కొనసాగుతోంది. ఈ మూవీకు సినిమాటోగ్రఫి అందించిన ఎస్. సౌందర్ రాజన్ బాగా చూపించాడు. విజువల్స్ పరంగా గ్రాండ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. థమన్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. సంపత్ నంది దర్శకత్వం బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడ అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. ఇక స్క్రీన్ ప్లే కూడా స్లో గా సాగింది. సెకండాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ కూడా ఊహించనట్లే ఉంటుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే యాక్షన్ సినిమాలను బాగా ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -