Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన కేసీఆర్ జ్యోష్యం….

- Advertisement -

2019 ఏపీ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు ప్ర‌తీష్టాత్మ‌కం కానున్నాయి. వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్న రీతిలో భారీ యుద్ధాన్ని చేయ‌బోతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో విజేత ఎవ‌ర‌నే దానిపై ఎవ‌రి దీమా వారిదే. అయితే తాజాగా తెలంగాన సీఎం కేసీఆర్ చెప్పిన మాట‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మాట‌లు బాబు గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.
కేసీఆర్ విలేక‌రుల‌తో ముచ్చ‌టించిన స‌మ‌యంలో త‌న దైన శైలిలో ఏపీ రాజ‌కీయాల‌పై జ్యోష్యం చెప్పారు. ఓటుకు నోటు కేసు క్లోజ్ కాలేద‌ని విచార‌న కొన‌సాగుతోంద‌ని చెప్పారు. అంద‌రూ బాబుతో క‌ల‌సి ఈకేసును మాపీ చేశార‌నె వార్త‌ల‌ను ఖండించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో తెలుగు త‌మ్ముల్ల‌లో భ‌యం మొద‌ల‌య్యింది. ఎన్నిక‌ల కీల‌క స‌మ‌యంలో ఓటుకు నోటుకేసులో బాబుకు శిక్ష ప‌డ‌టం ఖాయమ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.
ఏపీలో వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై త‌న దైన శైల‌లో జ్యోష్యం చెప్పారు.ఇదే ఇప్పుడు బాబుకు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తోంది.తెలంగానాలో ఎక్క‌డా కుల‌రాజ‌కీయాలు లేవ‌ని ….కాని ఏపీలో ఇందుకు ప‌రిస్థితి బిన్నంగా ఉంద‌న్నారు.కుల రాజ‌కీయాల‌ను ఇప్ప‌టికిప్పుడు రూపుమాప‌డం సాధ్యం కాద‌న్నారు.
చిరంజీవి పార్టీ పెట్టి న‌డ‌ప‌లేక చేతులెత్తేవార‌న్నారు.ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా చేతులు ఊప‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేడ‌న్నారు.కేసీఆర్‌కు చెందిన ఓ స‌ర్వే సంస్త ప్ర‌కారం వైసీపీకి 45%, టీడీపీకి43%, జ‌న‌సేన‌కు1%, భాజాపాకు 2.6% ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఏపీలో ప్ర‌జ‌ల ఆద‌ర‌న‌తో జ‌గ‌నే సీఎం అవుతార‌ని జోష్యం చెప్పారు.
కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేయ‌డంలోను,ఓట‌ర్ల‌నాడి ప‌సిగ‌ట్ట‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.దీనికితోడు సీట్ల పెంపు బాబుకు తీవ్ర క‌ష్టాలు తెచ్చిపెడుతుంద‌న్నారు.అదే విధంగా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లాంటి 9 ప‌త‌కాలు మేలు చేస్తాయ‌ని చెప్పారు. కేసీఆర్ జోష్యంతో టీడీపీ త‌మ్ముల్లో భ‌యం మొద‌ల‌వ‌గా…అటు వైసీపీ శ్రేణులు మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -