Friday, May 3, 2024
- Advertisement -

పెళ్లికి సమంత ఫ్యామిలీ రాలేదా..? ఎందుకు..?

- Advertisement -

హీరోయిన్ సమంత అలాగే అక్కినేని వారసుడు నాగచైతన్య ల వివాహం.. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అంగరంగవైభవంగా ఆత్మీయులూ స్నేహితులూ బంధువుల మధ్యన జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకను అభిమానులు అందరూ మిస్సవుతారనుకున్నారు. కానీ అలా జరగకుండా.. స్వయంగా నాగర్జున అండ్ సమంతలే తమ ట్విట్టర్ ద్వారా ప్రతీ గంటగంటకూ ఫోటోలను రిలీజ్ చేస్తూ.. అసలు గోవాలోని డబ్లూ హోటల్ లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చెప్పారు.

ఇక ఈ పెళ్లిలో ఒక ప్రక్కన రామానాయుడు గారి కుటుంబం, మరో ప్రక్కన అక్కినేని కుటుంబం.. ఇలా అక్కడ కుటుంబాల మధ్య చైతు, సమంత ఒక్కటాయ్యారు. కానీ ఒక్క సందేహం ఏంటంటే.. అసలు ఒక్క ఫోటోలో కూడా సమంత ఫ్యామిలీకి సంబంధించిన వారు లేరేంటి..? కనీసం వధూవరులతో ఒక్క ఫోటో లేదు. అలానే క్రిస్టియన్ వెడ్డింగ్ సంబంధించి చాలా ఫోటోలే రిలీజ్ అయ్యాయి. అయితే అందులో కూడా సమంత ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు కూడా కనిపించలేదు. అయితే ఫోటో లేదు అనేకంటే.. ఫోటోలు బయటకు రాలేదు అనుకోవాలి అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే సమంతను అసలు క్రిస్టియన్ వెడ్డింగ్ రోజున స్టేజీ దగ్గరకు నడుచుకుంటూ చేయి పట్టుకొని తీసుకొచ్చింది సమంత పెద్దన్నయ్యే.

గతంలో ఆమె పెద్దన్నయ్య చిన్నన్నయ్యా ఇదే తరహాలో ఎంగేజ్మేంట్ లో కూడా మెరిశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కనిపించారట. అయితే అసలు విషయం ఏంటంటే.. ఫోటోల్లో సమంత ఫ్యామిలీ అంతా కనిపించేస్తే.. వారి గురించి అందరికి తెలిసిపోయి.. ప్రైవసీ లేకుండా పోతుంది కాబట్టి.. వారు తమ ఫోటోలను రిలీజ్ చేయవద్దంటూ నాగర్జునను రిక్వెస్ట్ చేశారట. అందుకే వారి ఫోటోలేవి రాలేదని సమాచారం. అయితే సమంత అమ్మానాన్నలు ఈ పెళ్లికి రానేలేదు అనేవారు కూడా ఉన్నారు. అది అసలు విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -