Saturday, April 27, 2024
- Advertisement -

సమంత కొత్త అవతారం!

- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ సమంత కొత్త అవతారం ఎత్తింది. అనారోగ్యం కారణంగా సినిమాలకు విశ్రాంతి ఇచ్చిన ఈ బ్యూటి ప్రస్తుతం తన హెల్త్‌పై ఫోకస్ చేసింది.అయితే రీసెంట్‌గా సిటాడెల్ సిరీస్ కి డబ్బింగ్ చెప్పడంతో సినిమా వర్క్ మొదలు పెట్టడంతో సమంత ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చే ఈ బ్యూటీ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సొంతంగా నిర్మాణ సంస్థని స్థాపించి కొత్త అవతారంతో వస్తున్నానని తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు.

నేను మళ్ళీ వర్క్ చేయబోతున్నాను… ఇది ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇది నేను ఇష్టపడి చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. వచ్చే వారం నుండి ఈ హెల్త్ పాడ్‌కాస్ట్‌లు రిలీజ్ అవుతాయని తెలిపారు. మీలో చాలామందికి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను తెలిపింది. ఈ హెల్త్ పాడ్‌కాస్ట్ లో తను ఇన్నాళ్లు నేర్చుకున్నవి, ట్రీట్మెంట్స్, మానసిక, శారీరక ఆరోగ్యాల గురించి చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -