Monday, April 29, 2024
- Advertisement -

క్రాస్‌ ఓటింగ్..రెబల్ ఎమ్మెల్యేలపై వేటే!

- Advertisement -

వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకే సిద్ధమయ్యారు స్పీకర్ తమ్మినేని సీతారం.రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై వేటుకే స్పీకర్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే వైసీపీ రెబల్స్‌ను ఓ సారి విచారించిన స్పీకర్‌..ఇవాళ మరోసారి విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు స్పీకర్‌. ఇవాళ రెబల్ ఎమ్మెల్యేల నుండి మరోసారి వివరణ తీసుకుని నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే స్పీకర్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మరోసారి విచారణ తర్వాత రెబల్స్‌పై వేటు వేస్తారా లేదా మందలించి వదిలేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అధికార వైసీపీకి ఉన్న బలంతో మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కానీ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -