Friday, May 10, 2024
- Advertisement -

ఏలూరు నీదా…నాదా?

- Advertisement -

టీడీపీ – జనసేన మధ్య పొత్తు పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కూటమిలో బీజేపీలో చేరిక ఖరారు కావడంతో తొలి లిస్ట్ వాయిదా పడగా త్వరలోనే ఉమ్మడి లిస్ట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని స్థానాల్లో ఇంకా టీడీపీ – జనసేన మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇందులో ఏలూరు ఒకటి. గత ఎన్నికల్లో జనసేన గణనీయంగా ఓట్లు సాధించిన నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఇక్కడ జనసేనకు దాదాపు 16 వేల ఓట్లు వచ్చాయి. అయితే టీడీపీ రెండో స్థానంలో నిలవగా జనసేన మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జిగా బడేటి చంటి వ్యవహరిస్తున్నారు.

ఈసారి తనకే టికెట్ అని విస్తృత ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన అభ్యర్థి అప్పలనాయుడు నుండి తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి టికెట్ తనకేనని జనసేన నేత చెబుతుండగా ఈ రెండు పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపు నల్లేరుపై నడకే అని భావిస్తున్న తరుణంలో టీడీపీ – జనసేన నేతల మధ్య పోరు జగన్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మార్గం మరింత సుగుమం చేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారుజ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -