Sunday, May 26, 2024
- Advertisement -

70 ఏళ్ల వృద్ధురాలిగా సమంత?

- Advertisement -

పెళ్లి త‌రువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంది హీరోయిన్ స‌మంత‌.గ్లామర్ పాత్ర‌లు కాకుండా నటనకి ఎక్కువగా అవకాశం వుండే పాత్రలను అంగీకరిస్తూ ప్రశంసలు అందుకుంటోంది స‌మంత‌.దీనిలో భాగంగానే స‌మంత దర్శకురాలు నందినీ రెడ్డితో గ‌త కొంత‌కాలంగా కథా చర్చలు జరుగుతున్నాయట.ఇది 2014లో వచ్చిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది.

అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వన యువతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్ర‌లో సమంతను చూపించాలని నందినీ రెడ్డి భావిస్తుంద‌టా.కొత్తదనంతో కూడిన పాత్రలనే ఎక్కువగా చేస్తానని ఇటీవలే చెప్పిన సమంత, మ‌రి ఈ సినిమా చేస్తుందో లేదో చూడాలి.ఇక స‌మంత ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తుంది.క‌న్న‌డ యూట‌ర్న్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో స‌మంత న‌టిస్తుంది.దీంతోపాటు,నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మ‌రో మూవీని అంగీక‌రించింది స‌మంత‌.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -