Friday, May 3, 2024
- Advertisement -

కుక్క నాకినందుకు కాళ్లు, చేతులు తీసేశారు…ఎందుకో తెలుసా..?

- Advertisement -

ప్ర‌పంచ‌లో ఎక్క‌డో ఒక‌చోట అంతు చిక్క‌ని వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటారు. అలాంటి వ్యాధులు ల‌క్ష‌ల్లో ఒక‌రికి అలాంటి వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిని పూర్తిగా న‌యం చేసే టీట్‌మెంట్ కూడా క‌ష్ట‌మే. తాజాగా మ‌రొక అంటు వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. కుక్క నాక‌డంతో అత‌ని శ‌రీరంలోని కాల్లు, చేత‌లు తొల‌గించాల్సి వ‌చ్చింది. ఇది విన‌డానికి న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా నిజం.

అయినప్పటికీ అతడికి మళ్లీ సర్జరీ చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని విస్‌కాన్సిన్‌లో వెలుగులోకి వచ్చింది. గ్రేగ్‌ మంటఫేల్‌(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు. ఇంకా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాళ్లు, చేతులు తొలగించాల్సి వచ్చిందంటే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యే అయ్యుంటుంది అనుకుంటున్నారా.. అవును గ్రేగ్‌ ఒక అరుదైన బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అత‌నికి ఆవ్యాధి మాత్రం విచిత్రంగా సోకిందంటే ఎవ‌రికీ న‌మ్మ‌బుద్ది కాదు.

తన భర్తను కుక్క నాకడంతో అరుదైన అంటువ్యాధి సోకిందని అతని భార్య డాన్ మాంటెఫెల్ గురువారం చెప్పింది. తన భర్తకు ఇప్పటికే ఏడు సర్జరీలు జరిగినప్పటికీ కుంగుబాటుకు లోనుకాకుండా ధైర్యంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. అయినా వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాలేదని , మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

అసలు ఆ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడటానికి కారణాలను వైద్యులు వివరించారు. సాధారణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే రక్తానికి ఈ వ్యాధి సోకింది. ఐతే జంతుప్రేమికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని ఎప్పటిలాగే ఇకపై కూడా మీ పెంపుడు జంతువులతో ప్రేమగా ఉండొచ్చని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -