మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఇటివలే బ్రహ్మోత్సవం షూటింగ్ లొకేషన్ వచ్చిందట. అక్కడే ఉన్న సమంతకు పెద్ద షాక్ ఇచ్చింది. సమంతకు షాక్ ఇవ్వడం ఏంటి? అనుకుంటున్నారా? బ్రహ్మోత్సవం షూటింగ్ లొకేషన్ వచ్చిన సితారను సమంత దగ్గరికి తీసుకుంది. మనిద్దరం ఆడుకుందామా అని సితారతో అందట.
సితార కూడా సరే అని చెప్పి, కానీ ఓ కండీషన్ ఉందని చెప్పిందట. ఏంటి ఆ కండీషన్ అని సమంత అడిగిందట. వేంటనే సితార నీ కూతురు ని కూడా తీసుకురా అప్పుడు మనం ఆడుకుందాం అని చెప్పిందట. దాంతో సమంత ఆశ్చర్య పోయినప్పటికీ తర్వాత తేరుకొని ఓకే చెప్పిందట. సితార కు ఓకే చెప్పింది కానీ పెళ్లి కాని సమంత కు కూతురు లేకపోవడంతో ఇప్పుడు కూతురు కోసం ఓ చిన్నారిని వెదుకుతోందట.
నాకు కూతురు కావాలి ఎందుకంటే సితార తో కలిసి ఆడుకోవడానికి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది సమంత. సో అలా సమంతకు మహేష్ కూతురు జలక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత బ్రహ్మోత్సవం షూటింగ్ బిజీగా ఉంది. ఈ సమ్మర్‍లో ఈ సినిమాని రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు
