- Advertisement -

పవన్ ఫ్యాన్స్ యమ సంతోష పడుతున్నారు. ఎందుకంటే?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ రెడి అవుతుంది. ఈ నెల 20న ఆడియోని రిలీజ్ చేయబోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  అభిమానులు భారీగా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని చెప్పుతున్నారు చిత్ర యూనిట్.

పవన్ సరసన కాజల్  తొలిసారిగా హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ఒకే సారి తెలుగుతో పాటు హిందీ‍లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఓ వార్త పవన్ అభిమానులో తెగ సంతోష పెడుతుంది. మా అభిమాన హీరో సినిమా బాలీవుడ్‍లో కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంటుందని అలాగే ఖచ్చితంగా టాలీవుడ్ కూడా రికార్డులు సృష్టిస్తుందని చెపుతున్నారు.

సో పవన్ సినిమా బాలీవుడ్‍లో కూడా రిలీజ్ కావడంతో అభిమానులో మరింత అంచనాలు పెరిగిపోయాయి. సో మరి ఈ సినిమా టాలీవుడ్‍, బాలీవుడ్‍లో ఏ రెంజ్‍లో అద్భుతం సృష్టిస్తుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -