Sunday, May 12, 2024
- Advertisement -

సమంత పెళ్లి చీర ఎవరిదో తెలుసా..?

- Advertisement -

అక్టోబర్ 6 నుంచి 9 వరకు నాగచైతన్య సమంత వెడ్డింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పెళ్లి రెండు సంప్రదాయాల ప్రకారం జరగనుంది. మొదట క్రిస్టియన్ పద్దతిలో జరిగిన తర్వాత.. తెలుగు సంప్రదాయం ప్రకారం జరగనుంది. ఈ పెళ్లి కోసం ఏర్పాట్లు ఓ రెంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసిందే. అదేంటంటే సామ్ పెళ్లిరోజు కట్టుకోబోయే చీర చైతు అమ్మమ్మది అట, అంటే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య రాజేశ్వరిది. ఈ చీరను క్రిషా తనదైన స్టయిల్ లో మార్పులు చేస్తూ చీరపై బంగారు జరీ అంచు సొగసులు అద్దుతూ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గుపాటి కుటుంబాలకు చెందిన అలనాటి చీరను సమంత కోసం ఇస్తున్నారు. అంటే వారి సంప్రదాయానికి విలువిస్తున్నటు తెలుస్తుంది.

అలానే పెళ్లి నగలు కూడా ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నగలు డైమండ్స్, కుందన్స్ తో తయారవుతున్నట్టు తెలుస్తుంది. సో చైతు సామ్ ల పెళ్లిలో రిచ్ నెస్ తో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి సామ్ పెళ్లి చీర చూడాలంటే.. ఆక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=tSqfmS3RxMo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -