Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ దగ్గర సంపూ ఎందుకు ఏడ్చాడు..?

- Advertisement -

బిగ్ బాస్ షో ప్రస్తుతం.. ఈ షో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఇప్పుడు బాగా క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షోకి చేయడం కూడా బాగా ప్లస్ అయింది. అయితే ఇటివలే ఈ షోలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు.. అర్ధంతరంగా ఈ షో నుంచి నిష్క్రమించాడు. దాంతో ఈ షో నుంచి వెళ్లిపోయిన సంపూర్ణేష్ బాబుపై తీవ్రంగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఈ విమర్శలు సంపూను ఓ రెంజ్ లో బాధపెడుతున్నాయి.

అయితే ఇప్పుడు వీటిపై సంపూర్ణేష్ బాబు స్పందించాడు. హౌస్‌ నుంచి వీడిన హీరో సంపూర్ణేష్ బాబు టీవీలో తళుక్కున మెరిసి తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాను బిగ్ బాస్‌ను వీడటానికి గల కారణాలను ప్రేక్షకులకు పంచుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను బిగ్ బాస్‌ హౌస్‌లో ఇమడలేకపోయానని.. ఈ విషయంలో తనను వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని.. అవి తనను చాలా బాధపెడుతున్నాయంటూ సంపూ వ్యాఖ్యానించి.. బోరున విలపించాడు. ఆ తర్వార వెంటనే సంపూర్ణేష్ బాబుని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -