Sunday, May 19, 2024
- Advertisement -

రాజకీయాలలోకి జూనియర్ ఎన్టీఆర్ ? కొత్త పార్టీ !!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి ఈ మధ్య కాలం లో సైలెంట్ గానే ఉన్నా అతను తీస్కుంటున్న కొన్ని ఆసక్తికర నిర్ణయాలు అతని జీవితాన్ని ఎటువైపు తిప్పబోతున్నాయి అనేది అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అతని లో రెండు కోణాలు ఉన్నాయి అనీ రెండవ కోణం రాజకీయం వైపు ఆసక్తి చూపుతోంది అనీ ఆసక్తికర నిర్ణయం తీసుకోవడానికి తారక్ ఎంతో దూరం లో లేడు అనీ అంటున్నారు విశ్లేషకులు. అతను ఒక రగిలే నిప్పుకణం అని అభిమానులు చెబుతూ ఉంటారు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో మనోదిని ఎప్పుడూ దూరంగానే పెట్టారు టీడీపీ వర్గాల వారు.

అటు మామ చంద్రబాబు గానీ దగ్గరగా ఉంచుకోవాల్సిన బాలయ్య కానీ బావ లోకేష్ గానీ ఎన్టీఆర్ ని ఎంత దూరం పెడితే అంత మంచిది అన్నట్టుగా వ్యవహారం నడిపించారు. నారా కుటుంబం తో గానీ ఇటు నంద‌మూరి ఫ్యామిలీతోనూ త‌న‌కి ఉన్న స‌ఖ్య‌త జీరో. అందుకే రాజ‌కీయాల్లో మునుముందు త‌న ఉనికిని చాటుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. తాత న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌముడు, రాజ‌కీయ దురందురుడు అయిన తార‌క‌రాముని వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాజ్యం నాదే అని నిరూపించుకోవాల్సిన స‌వాల్ ఎన్టీఆర్ ముందు ఉంది. ఆ సంగ‌తిని అత‌డు ఎప్పుడో గ్ర‌హించాడు. నివురుగ‌ప్పిన నిప్పులా స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నాడు. టైమ్ క‌లిసి రావాలి.

అది వ‌చ్చిందే అంటే అత‌డు ఉరికే తీరు కొద‌మ సింహాన్నే త‌ల‌పిస్తుంది. త‌న‌కి ఏపీలో బ‌ల‌మైన నేత‌ల అండ‌దండ‌లున్నాయ్‌. ఎలానూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని త‌న‌కి అత్యంత స‌న్నిహితుడు. ఏపీలో హ‌వా సాగించేంత క‌మ్యూనికేష‌న్‌, తెగువ ఉన్న‌వాడు. కాబ‌ట్టి ఏదీ తీసిపారేయ‌లేం. తెదేపా మీద జనాల ఆసక్తి రోజు రోజుకూ క్షీణించి పోయే అవకాశం ఉండడం తో ఇప్పుడు వైకాపా వైపు చూస్తున్నారు జనాలు. ఆ పార్టీ కూడా అవినీతి ముసుగులో ఉండి రెచ్చిపోతోంది సో 2019 నాటికి యాక్టివ్ గా ఉంటే తనకి కాస్త కలిసొచ్చే వారు తేలుస్తారు అనేది ఎన్టీఆర్ ఆలోచనత. కాబ‌ట్టి మునుముందు ఏపీ రాజ‌కీయ చిత్రంలో ఓ కొత్త పార్టీ వెల‌సినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ప‌లువురు రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -