Friday, May 3, 2024
- Advertisement -

దేవరలో మరో బాలీవుడ్ హీరో?

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొనగా 2024 ఏప్రిల్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక రెండు పార్టులుగా ఈ సినిమా రానుండగా దేవరకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న చిత్రం కావ డంతో ఓ కీలక రోల్‌లో సంజయ్ దత్ ను తీసుకున్నారని టాక్. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో తెలియదు గానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తున్నారు ఎన్టీఆర్.

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో కథ సాగనుంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ పాత్రలో తారక్ కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -